Pranay murder case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో (Pranay murder case) నల్లగొండ కోర్టు (Nalgonda court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం.. ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. మారుతిరావుతో పాటు సుభాష్‌కుమార్‌శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ భారీ, ఎంఏ కరీం, శ్రావణ్ కుమార్, ఆటో డ్రైవర్ నిజాం, మారుతీరావు కారు డ్రైవర్ శివ ఇతర నిందితులుగా ఉన్నారు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు, పోలీసులు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్య ఆరోపణల కింద అరెస్టు చేశారు.
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతీరావు మార్చి 7, 2020న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 2019లో సుభాష్ శర్మ తప్ప మిగతా వారందరికీ బెయిల్ లభించింది. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగగా.. ఇటీవలే వాదనలు ముగిశాయి. దీంతో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. నిందితులకు శిక్ష ఖరారు చేసింది.
Also Read..
Yadagirigutta | యాదగిరిగుట్ట నారసింహుని సేవలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Farmer Suicide| పురుగుల మందు సేవించి కౌలు రైతు ఆత్మహత్య
Karimnagar | విలీన గ్రామాలు అస్తవ్యస్థం.. వార్డు కార్యాలయాలు తెరిచేది ఎప్పుడో ?