దుబాయ్ : ముగింపు దశకు చేరుకున్న పొట్టి ప్రపంచకప్‌లో టోర్నీ ఆసాంతం రాణించిన ప్లేయర్లకు అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ కోసం ఐసీసీ శుక్రవారం 8 మందితో కూడిన నామినీలను ప్రకటించింది. జాబితాలో భారత్ నుంచి వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్, పాక్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్, సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్,్ర పేసర్ లుంగి ఎంగిడి, కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, ఓపెనర్ టిమ్ సీఫర్ట్, అమెరికా బౌలర్ షాడ్లే ఉన్నారు.
టోర్నీ ఆరంభ దశలో జట్టులో చోటు దక్కని శాంసన్.. సూపర్-8 దశ నుంచి మాత్రం అదరగొడుతున్నాడు. వెస్టిండీస్‌తో క్వార్టర్స్ ఫైనల్ వంటి పోరులో కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన అతడు.. సెమీస్‌లో అద్భుతంగా రాణించి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.