నల్లగొండ : నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం(Heavy flood) కొనసాగుతున్నది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 2.10లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam project) నుంచి సాగర్‌కు 2.50 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో అంతే మొత్తంలో జలాశయం నుంచి విడుదల కొనసాగుతోంది.
జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలుగా ఉన్నది. కాగా, కృష్ణా దిగువ ప్రాంతంలో వరద ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Also Read..