Rao Ramesh | కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జైభీమ్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాలో నటనకు గాను సూర్యతో పాటు మణికందన్, లిజిమోల్ జోస్, ప్రకాశ్ రాజ్‌లపై ప్రశంసలు కురిసాయి. అయితే ఈ సినిమా టైంలో జరిగిన ఒక సంఘటన గురించి తాజాగా పంచుకున్నాడు తెలుగు నటుడు రావు రమేష్.
రావు రమేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం (Maruthi Nagar Subramanyam ). ఇంద్రజ హీరోయిన్గా నటించగా.. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య తనకు గోల్డ్ కాయిన్ ఇచ్చినట్లు తెలిపాడు రావు రమేష్. జైభీమ్ సినిమాకు తెలుగుతో పాటు తమిళంలో కూడా నేనే డబ్బింగ్ చెప్పాను. అయితే తమిళంలో డబ్బింగ్ చెప్పినందుకు సూర్య నా దగ్గరకు సర్. తమిళ భాషపై మీకున్న గౌరవానికి ఇది నా బహుమానం అంటూ గోల్డ్ కాయిన్ ఇచ్చాడు. ఆ టైంలో జైభీమ్ టీం మొత్తం అందరు లేచి చప్పట్లు కొట్టారు. అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటూ రావు రమేష్ చెప్పుకోచ్చాడు.
Also Read..