Gujarat Rains | గుజరాత్లో వర్ష బీభత్సం (Gujarat Rains) కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సౌరాష్ట్ర ప్రాంతం మొత్తం అతలాకుతలమవుతోంది. అనేక ప్రాంతాలను వరద ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ఇక వడోదరలో (Vadodara)నూ పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలోని విశ్వమిత్ర నదికి వరద పోటెత్తింది. నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. ఈ వరదల్లో భారత మహిళా క్రికెటర్ (India Womens Cricketer), స్పిన్నర్ రాధా యాదవ్ (Radha Yadav) కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ విషయాన్ని క్రికెటరే స్వయంగా ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సహాయక బృందాలకు ఆమె కృతజ్ఞతలకు తెలిపారు.
Also Read..
Gujarat Rains | గుజరాత్లో కొనసాగుతున్న వర్ష బీభత్సం.. నాలుగు రోజుల్లో 28 మంది మృతి
Encounter | జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Rain in Delhi | ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. మునిగిన అండర్‌పాస్‌లు