హైదరాబాద్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా, సంగీతాత్మకమైన అజంత భాషగా తెలుగు వినుతికెక్కిందని చెప్పారు. వేల సంవత్సరాలుగా నవ కాంతులు విరజిమ్ముతున్న గొప్ప వెలుగు మన తెలుగని వెల్లడించారు. మాతృభాషలు మసకబారుతున్న విషమ సందర్భంలో తెలుగు వెలుగును కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా,
సంగీతాత్మకమైన అజంత భాషగా వినుతికెక్కింది మన తెలుగు.వేల సంవత్సరాలుగా నవ కాంతులు విరజిమ్ముతున్న గొప్ప వెలుగు మన తెలుగు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు.
మాతృభాషలు మసకబారుతున్న విషమ సందర్భంలో తెలుగు వెలుగును… pic.twitter.com/r5lWgGLlm4
— Harish Rao Thanneeru (@BRSHarish) August 29, 2024