Ajith Kumar | బైక్ లేదా కార్ రేసింగ్ అంటే సౌత్ ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar). ఈయనకు బైక్‌లన్నా, కార్ రైడింగ్లన్నా విపరీతమైన ఇష్టమన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన అనేక బైక్ రేసులతో పాటు ఫార్ములా వన్ కారు రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక ఖాళీ సమయం దొరికిందంటే చాలు తన వద్ద ఉన్న సూపర్ బైక్ (superbike)పై చక్కర్లు కొడుతుంటారు ఈ స్టార్ హీరో. బైక్ రైడింగ్‌పై ఉన్న మక్కువతో ఒక్కోసారి వందల కిలోమీటర్లు సైతం బైక్‌పైనే ప్రయాణిస్తుంటారు. అయితే తాజాగా అజిత్ కార్ రేసింగ్‌లో దూసుకెళ్లాడు. తాజాగా ఆయన తన ఆడీ కారులో గంటకు 234 కి.మీల వేగంతో దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
సినిమాల విషయానికి వస్తే.. విదాముయార్చి, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’ అనే సినిమాల్లో అజిత్ ప్రస్తుతం నటిస్తున్నాడు. విదాముయార్చి (VidaaMuyarchi) సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరోవైపు అజిత్ నటిస్తోన్న యాక్షన్ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
New video of #Ajithkumar during the racing🏎️
Speed👀🔥pic.twitter.com/Qsyi6BYtgZ— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2024
Also read..