Shahid Kapoor – Mira Kapoor | కెరీర్లో వరుస పరాజయాలు చవిచూసిన షాహిద్ కబీర్ సింగ్ రూపంలో చాలా రోజులకు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఫర్జీ, ‘జెర్సీ’ వంటి సినిమాలతో దూసుకుపోతున్నాడు షాహిద్. అయితే షాహిద్ సతీమణి మీరా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాజ్‌పుత్‌లో కుటుంబంలో పుట్టిన మీరా మోడల్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక షాహిద్‌తో పెళ్లి అయిన అనంతరం తన రంగంలో రాణించడంతో పాటు షాహిద్ కపూర్ కెరీర్లో తోడునీడగా ఉంటుంది. అయితే ఈ భామ ఒకప్పుడు చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కరణ్ జోహర్ హోస్ట్ చేసిన కాఫి విత్ కరణ్ షోలో పాల్గోన్న మీరా కపూర్ తన మనసులోని మాటను బయటనపెట్టింది. కరణ్ ఈ షోలో మీరాను అడుగుతూ.. షాహిద్ కపూర్ చేయాలనుకున్న సినిమాకి మీరా కపూర్ పేరు పెట్టాలి అంటే ఏం పేరు పెడతారు అంటూ అడిగాడు. దీనికి మీరా సమాధానమిస్తూ.. రాక్‌స్టార్ అంటూ సమాధానమిచ్చింది. రణ్‌బీర్ కపూర్ నటించిన రాక్‌స్టార్ సినిమా షాహిద్ చేయాలని ఉండేది. కానీ అది అవ్వలేదు అంటూ చెప్పుకోచ్చింది ఈ భామ. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే.. షాహిద్, మీరా కపూర్ 2015లో గురుగ్రామ్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
Also Read..