హైదరాబాద్ : అర్హులందరికి ఉచిత విద్యుత్(Free electricity), ఉచిత నీటి సరఫరాను వర్తింప చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. బేగంపేటలోని(Begumpet) జవహర్ జనతా, భర్తన్ కాంపౌండ్లలో గురువారం పర్యటించారు. విద్యుత్ బిల్లులు, నల్లా బిల్లులు చెల్లిం చాలంటూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు
చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..జీరో విద్యుత్ బిల్లు, ఉచిత నీటి సరఫరా చేస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు బిల్లులు చెల్లించాలని పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. అర్హులైన వారు బిల్లులు చెల్లించొద్దని ఎమ్మెల్యే సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో బస్తీలలో పారిశుధ్య నిర్వహణను నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా మురుగు నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.