నందికొండ, జూలై 29 : ఉమ్మడి తెలుగు రాష్ర్టాల వర ప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తడంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా కృష్ణాడెల్టాకు మంగళవారం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 2,55,811 క్యూసెక్కుల వరద ఉధృతి ఉండడంతో డ్యాం క్రస్ట్ గేట్లను పెంచుకుం టూ 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,04,048 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిల్‌కాలనీ పొట్టి చెలిమె సమీపంలో నాగార్జునసాగర్ డ్యాం ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా పంటపొలాలకు నీటిని విడుదల చేసి కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు.