టికెట్ ఇవ్వలేదనో.. ఇంకో కారణం వల్లనో.. బీఆర్ఎస్లో చేరలేదు. కాంగ్రెస్లో పెద్దలకు గౌరవం లేదు. నేను ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఏ ఒక్కసారి పైసలకు టికెట్ కొనుక్కోలే. రేవంత్రెడ్డి డబ్బులిస్తేనే సీట్ ఇస్తడట. నేనివ్వలేదు.. నాకు సీటివ్వలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ బాగుండాలంటే కేవలం బీఆర్ఎస్తో మాత్రమే సాధ్యం. అందుకే ఈ పార్టీలో చేరాను.
ఎక్కడ చేసిండు సర్వే. ఆ రిపోర్టులు బయటపెట్టమనండి. అంత ధైర్యం ఉందా?! సర్వేలు లేవు.. గిర్వేలు లేవు. కంప్యూటర్ ముంగట కూసోని ఏవో లెకలు రాసి ఏఐసీసీని మభ్యపెట్టి నమ్మించిండు.
పుంజుకోలేదు కానీ.. అధికారంలోకి రావాలని గింజుకుంటుంది. ఎంత చేసినా, ఎంత మొత్తుకున్నా ఆ పార్టీని నమ్మేస్థితిలో ప్రజలు లేరు. ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ను నమ్మడం లేదు. ఇక ప్రజలేం నమ్ముతారు!
అదొక కిరాణా దుకాణం. అకడ జిల్లా అధ్యక్షుల పదవులు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్ ఇలా రకరకాల విభాగాల అధ్యక్ష పదవులు అమ్ముకుంటరు. ఎన్నికలొస్తే సీట్లు అమ్ముకుంటరు. ఎదుగుతున్న నాయకుల కాళ్లు పట్టుకొని కిందికి గుంజుతరు. అంతా లొల్లి లొల్లి.. అంగడి అంగడి ఉంటది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తానని మాటిచ్చారు కాబట్టి అప్పుడు బీజేపీలో చేరిన. అకడ వ్యవస్థ, నాయకత్వం అంతా గందరగోళంగా ఉంటది. తెలంగాణకు ఏం కావాలన్నది బీజేపీకి తెలియదు. అందుకే ఆ పార్టీలో చేరే ఆలోచన రాలేదు. అకడి నుంచి ఆహ్వానం కూడా అందలేదు. తెలంగాణ తెస్త అని మాటిచ్చి.. పోరాడి.. రాష్ట్రం సాధించి, అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనిపించింది. నాతో మాట్లాడి నన్ను గౌరవించిన కేసీఆర్ మాట మీద నమ్మకంతో బీఆర్ఎస్లో చేరా.
-సుంకరి