నాగర్కర్నూల్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం( Palamuru lift Irrigation project) పనులను వెంటనే ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardhan Reddy) డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కుమ్మెర వద్ద వట్టెం పంపు హౌస్ మునిగిపోవడం వంద శాతం ప్రభుత్వం నిర్లక్ష్యమని, ప్రజలు చెప్పినా అధికా రులు పట్టించుకోలేదని విమర్శించారు.
పెద్ద మోగర్లతో నీళ్లను తోడి మునిగిన మోగర్లను బయటకు తీయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరొస్తుం దని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించారు. త్వరలో తాను ప్రాజెక్టును సందర్శిస్తానని అన్నారు. హైడ్రాతో పేదలకు నష్టం కలిగించడం సరికాదన్నారు. కేటీఆర్ తనను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని స్పష్టం చేశారు.