బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 16:41:55

లంచం కేసులో నాచారం పీఎస్ ఎస్ఐ స‌స్పెండ్

లంచం కేసులో నాచారం పీఎస్ ఎస్ఐ స‌స్పెండ్

హైద‌రాబాద్ : నాచారం పోలీసు స్టేష‌న్‌లో ఎస్ఐగా విధులు నిర్వ‌ర్తిస్తున్న శివ‌కుమార్‌ను రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ స‌స్పెండ్ చేశారు. ఎస్ఐ శివ‌కుమార్‌తో పాటు కానిస్టేబుల్స్ అశోక్, రాముపై కూడా వేటు ప‌డింది. గుట్కా వ్యాపారి నుంచి లంచం తీసుకున్నార‌ని ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేసిన‌ట్లు రాచ‌కొండ సీపీ తెలిపారు. పోలీసులు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే 9490617111కు ఫిర్యాదు చేయాల‌ని సీపీ సూచించారు.


logo