Lok Sabha elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేశారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్ హైస్కూల్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కేంద్ర హోం శాఖ మంత్రి, గాంధీనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అమిత్ షా సైతం తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి సోనాల్ షా, కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జైషా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
#WATCH | Prime Minister Narendra Modi casts his vote for #LokSabhaElections2024 at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat pic.twitter.com/i057pygTkJ
— ANI (@ANI) May 7, 2024
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ విదిశ లోక్‌సభ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషీ, జ్యోతిరాదిత్య సింధియా, బారామతి ఎంపీ అభ్యర్థులు సుప్రియా సూలే, సునేత్ర పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ – ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Karnataka: Congress national president Mallikarjun Kharge casts his vote at a polling station in Kalaburagi.
Congress has fielded party chief Mallikarjun Kharge’s son-in-law Radhakrishna Doddamani from Kalaburagi constituency and BJP has fielded Umesh G Jadhav.… pic.twitter.com/ynfFT0bspi
— ANI (@ANI) May 7, 2024
Also Read..
Lok Sabha Elections | రెండు గంటల్లో పది శాతం పోలింగ్.. రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం ఇలా
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలు.. కొనసాగుతున్న మూడో విడుత పోలింగ్
Met Gala | మెట్ గాలాలో మెరిసిన అలియా భట్, ఈషా అంబానీ.. కస్టమ్ మేడ్ దుస్తుల్లో స్టార్స్ హొయలు