Bollam Mallaiah Yadav | రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించాలని.. జర్నలిస్టులను రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. కళాశాల యాజమాన్యాలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సీఎం బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.
ఉగ్రవాది కంటే దారుణంగా సీఎం భాష ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మూడు నెలలు అప్పగించమని హరీశ్ రావు అడిగారు. బీర్ల అయిలయ్యను సీఎం వాడుకుంటున్నారు. బీర్ల అయిలయ్య స్థాయి ఏంటి…? రేవంత్ రెడ్డి హరీశ్ రావు శిష్యుడు. హరీశ్ రావు విజయోత్సవ ర్యాలీలో రేవంత్ రెడ్డి డ్యాన్స్ లు వేశారు.రేవంత్ రెడ్డికి నేర చరిత్ర ఉంది. బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లిలో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీలో చర్చ పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రాలేదని అన్నారు.
రేవంత్ రెడ్డికి కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజీలు ఎక్కడ ఉన్నాయో తెలియదు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే మేడిగడ్డకు ప్రమాదం లేదు. రేవంత్ రెడ్డి అసహనంలో ఉన్నారు. సర్వేలను రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు. నరహంతకుడి భాష మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలి. కాంగ్రెస్ అధిష్టానంను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి సీఎం పదవిలో కొనసాగుతున్నారేమోనన్నారు.
హరీశ్ రావుకు ఇరిగేషన్‌పై అనుభవం ఉంది. మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రక్తంతో రేవంత్ రెడ్డి పంటలు పండించాలి. రేవంత్ రెడ్డిని నడి బజారులో ఉరి తీసినా పాపం లేదు. రేవంత్ రెడ్డి హిట్లర్ ను మరిపిస్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లపై మాట్లాడటానికి రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం ఉందా.. ? కాంగ్రెస్ అధిష్టానం సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమీషన్లు వసూలు చేసే బిజీలో ఉన్నారు . రేవంత్ రెడ్డి భజనపరులు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
Read ALso :
Anil Menon | ఈ రాత్రే అంతరిక్ష యాత్రకు అనిల్ మీనన్.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తిరిగి భూమికి
Watch: కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై రైల్వే వివరణ
Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచిన నైలా గ్రేవల్ !