Harish Rao | రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ చావును కోరుకుంటాడు.. కేసీఆర్ చావు గురించి మాట్లాడుతా ఉంటాడు.. కేసీఆర్ పేగులు ఊడపీకి మెడలో వేసుకుంటా అని మాట్లాడుతుంటాడు.. కేసీఆర్ కండ్ల గుడ్లు ఊడపీకి గోటీలాడుతా అని మాట్లాడుతాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ… చావు భాష మాట్లాడే రేవంత్ రెడ్డి.. ఇవాళ ఎమ్మెల్యేల చేత కూడా కేసీఆర్ చావాలని చెప్పి మాట్లాడిస్తున్నడు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇవాళ కేసీఆర్ చావాలి.. దరిద్రం.. కేసీఆర్ చచ్చిపోతే పీడపోతది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడటమంటే.. అది రేవంత్ రెడ్డి ప్రేరేపించి మాట్లాడిస్తున్న మాట అన్నారు.
కేసీఆర్ చావును కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడిండు కదా.. ఆ ఎమ్మెల్యేపై తక్షణమే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలే. ఆయన శాసన సభ్యత్వాన్నిరద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు హరీశ్ రావు. ఏమీ అనని మా నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేస్తామని మీరు పూనుకున్నరే.. ఇయ్యాళ్ల టీవీల్లో మార్మోగుతోంది.. బహిరంగంగానే ప్రెస్ మీట్లోనే కేసీఆర్ ప్రతిపక్ష నేత, తెలంగాణ సాధించిన నాయకుడు, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడి చావు కోరుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే ఆయన శిష్యుడిగా శంకర్ మాట్లాడిన మాటల మీద స్పీకర్‌కు వినబడతలేదా.. సభలో ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థానం ప్రతిపక్ష నాయకుడిది. ప్రతిపక్ష నాయకుడి చావునే కోరుకునే విధంగా ఆ సభలో ఉండే సభ్యుడే మాట్లాడితే స్పీకర్‌కు కనబడుతలేదా..? వినబడుతలేదా..? అని అడుగుతున్నా.
స్పీకర్ దీని మీద ఎందుకు చర్య తీసుకోరని హరీశ్ రావు ప్రశ్నించారు. దీని మీద ఎందుకు చర్చ పెట్టరు.. ఎందుకు ఆ శాసనసభ్యుడిని తీసివేయరని అడుగుతున్నానన్నారు. మా మహిళా శాసనసభ్యుల మీద దాడి జరిగితే అసలు దాడే జరుగలేదంటారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు హరీశ్ రావు. ప్రతిపక్ష నాయకుడి చావును కోరుకుంటే అది మీకు కనబడదు.. వినబడదు.. ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. స్పీకర్‌గా మీరు 119 మంది ఎమ్మెల్యేలను సమానంగా చూడాలన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ చావును కోరుకుంటాడు
చావు భాష మాట్లాడే రేవంత్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యేల చేత కూడా చావు భాషను మాట్లాడిస్తున్నాడు
కేసీఆర్ చనిపోవాలని మాట్లాడిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి
రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆయన… https://t.co/Cun4blIQzz pic.twitter.com/tsZZwlYqET
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
National Film Awards | ఢిల్లీకి వీడ్కోలు.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికలో కీలక మార్పు!
Punjab Farmer: పంజాబ్‌లో డ్రగ్స్.. రైతు ఆత్మహత్యతో తీవ్ర దుమారం