Botsa Satyanarayana | బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు : మాజీ మంత్రి బొత్స
Botsa Satyanarayana | ఏపీ సీఎం చంద్రబాబు బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu) బీసీ ( BCs ) లకు మరోసారి వెన్నుపోటు ( Backstabbed ) పొడిచారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana ) ఆరోపించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళతానని చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. రిజర్వేషన్లు 50శాతం కంటే మించవద్దని కోర్టు గతంలో స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ బీసీలకు రిజర్వేషన్ల పెంపుదల జీవోను తీసుకొచ్చారని విమర్శించారు.
బీసీల పట్ల ప్రేమ ఉంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు కేంద్రంపై ఒత్తిడిలు తీసుకురావాలని సూచించారు. వెన్నుపోటు పార్టీలో ఉన్న బీసీ నాయకులు చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని కోరారు. బీసీల మనోభావాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అయితే బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుందని తప్పుడు ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి బీసీ రిజర్వేషన్లను సాకుగా చూపవద్దని సూచించారు. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

