జగిత్యాల, మే 15: ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు రైతులు ఇన్ని తిప్పలు పడాలా?, అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన బీర్పూర్, తుంగూర్ గ్రామాల్లో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
అంతకుముందు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొనుగోళ్లు, రవాణా, అన్లోడింగ్ ఆలస్యానికి జిల్లా యంత్రాంగమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.