Musi River | హైదరాబాద్ : మూసీ సుందరీకరణ పేరిట.. లక్షలాది ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇండ్లకు రెడ్ మార్క్ వేశారు. కొంతమంది నివాసితులను కూడా ఖాళీ చేయించారు అధికారులు. ఈ క్రమంలో కోట్ల రూపాయాలు పోసి కొన్న తమ ఇండ్ల జోలికి రావొద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొందరు హెచ్చరించారు. అయినప్పటికీ రేవంత్ సర్కార్ ముందడుగు వేయడంతో.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
ఇక తమ ఇండ్లను కూల్చివేయదంటూ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. హైదరాబాద్లోని చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ ఇంటి వద్ద చూసిన కోర్ట్ స్టే లే దర్శనమిస్తున్నాయి. దాదాపు 100 ఇండ్ల యజమానులు కోర్టు స్టే తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఐదురోజులు వానలే వానలు..
Council Chairman Gutha | సమాజ రుగ్మతలకు బౌద్ధమే శరణ్యం : శాసనమండలి చైర్మన్ గుత్తా