హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): స్థానిక ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సారథ్యంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించనుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు వీరి పర్యటన కొనసాగుతుంది.
సియోల్‌లోని రివర్ ఫ్రంట్ అభివృద్ధిని ఈ బృందం పరిశీలిస్తుంది. ఇందుకోసం 50 మందితో కూడిన బృందం 20న హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ పర్యటనకు వెళ్లకూడదని మూసీ పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.