హైదరాబాద్ : నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. సోమవారం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి మూడు సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఒక సెట్ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. మిగతా నామినేషన్లను స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేయగా.. ఇప్పటి వరకు 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 14తో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనున్నది. నవంబర్ 3న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.