Muncipal Elections | హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో పురపోరు మొదలుకానున్నది. బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చకుండానే రేవంత్ సర్కార్ మున్సి‘పోల్స్’కు సిద్ధమవుతున్నది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నది. మార్చిలో వార్షిక పరీక్షలున్నందున ఆలో పే ఎన్నికలు ముగించాలని యోచిస్తున్నది. సం క్రాంతి పండుగకు ముందే షెడ్యూల్ను విడుదల చేసి, ఫిబ్రవరిలో ఒకే విడుతలో పోలింగ్ దిశగా అడుగులు వేస్తున్నది.
ఫిబ్రవరి 25లోపు పురపోరు పూర్తి?
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి, టెన్త్ పరీక్షలు మార్చి 14నుంచి మొ దలుకానున్న నేపథ్యంలో వచ్చే నెల 25 కంటే ముందుగా ఎన్నికలు ముగించాలని సర్కారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మున్సిపల్ అధికారి అంచనా ప్రకారం.. ఈ నెల 11న షెడ్యూల్ ప్రకటించి, 25న నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నారు. 25 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి వచ్చే నెల 25లోపు ఎన్నికలు ముగించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు మూడు రోజులు, ఒక నామినేషన్ల పరిశీలన, మరో రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, నామినేషన్ల తిరస్కరణ ప్రక్రియపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, ఉపసంహరణ, బరిలో నిలిచిన అభ్యర్థుల ఫైనల్ జాబితా ప్రకటన ఉంటుంది. బ్యాలె ట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు రూ.85కోట్లు విడుదల చేయాలని మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది.
పుర ఓటర్ల తుది జాబితా 10న
రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, ఆరు ము న్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి ప్ర భుత్వానికి లేఖ రాశారు. మొత్తం 123 యూ ఎల్బీల్లోని 2,996 వార్డులకు ఎన్నికలు జరిపేందుకు అన్నీ సిద్ధం చేశామని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో 117 మున్సిపాలిటీలు, ఆరు కా ర్పొరేషన్లలో వార్డులవారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు కమిషనర్ గత నెల 29న షెడ్యూల్ విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా(01.10.2025 అర్హత తేదీ) ఆధారంగా జాబితాను రూపొందిస్తున్నారు. వార్డుల వారీగా ముసాయిదా జాబితాను ఈ నెల ఒకటిన ప్రదర్శించారు. వార్డులవారీగా అభ్యంతరాలను స్వీకరించి ఈ నెల 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, మంగళవారం జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయా పార్టీల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను రెండు రోజుల్లో పరిష్కరించి ఈ నెల 10న పోలింగ్ స్టేషన్లవారీగా ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు.
షెడ్యూల్ నాటికి ఉన్న జాబితానే ఫైనల్
మారిన కొత్త నిబంధనల ప్రకారం.. షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఎన్నికల సంఘం సిద్ధం చేసిన తుది ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీని ఆధారంగానే ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుందని అధికారవర్గా లు వెల్లడించాయి. షెడ్యూల్ తర్వాత కూడా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తే అవకతవకలకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు.
ఇంకా తేలని రిజర్వేషన్ల అంశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించి బీసీల ఓట్లు దండుకొని కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. గత నెలలో ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించలేదు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి బీసీ సంఘాలు కూడా కాస్త సైలెంట్ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగనున్నందున 42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఇప్పటికే బీసీ సంఘాల జేఏసీ స్పష్టంచేసింది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించనున్నది. క్షేత్రస్థాయిలో బీసీల జనాభా, వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని కమిషన్ ఇప్పటికే పరిశీలిస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో యూఎల్బీలు, జనాభా