Municipal Elections | కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది. మధ్యాహ్నం 3.45 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రెస్మీట్ పెట్టి, ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల సంగం ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో రాణి కుముదిని ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సీఎస్, డీజీపీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా, ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 15వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ను ఖరారు చేసినట్లు తెలిసింది.
కోర్టు వివాదాల్లో ఉన్న మున్సిపాల్టీలను మినహాయించి మొత్తంగా 116మున్సిపాల్టీలు, 7కార్పొరేషన్ల లో కొత్త పాలకవర్గాల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే మున్సిపాల్టీల వారీగా, చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియను సైతం ప్రభుత్వం పూర్తిచేసింది. ఎన్నికల సంఘం కూడా ముందస్తు ఏర్పాట్లపై ఇప్పటికే అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది.