Municipal Elections | కోరుట్ల, జనవరి 25 : రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్, ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూత్రప్రాయంగా వెల్లడించారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల స న్నాహక సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి వారు హాజ రై మాట్లాడారు. ప్రజలతో మమేకమైన వారికే టికెట్లు దకుతాయని తెలిపారు. టికెట్ రానివారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు.