మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వరదలకు ఊరు మునిగిపోతున్నా.. వంతెన నిర్మాణం పూర్తిచేయించకపోవడంతో అడవిలో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. .
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో గత సంవత్సరం వచ్చిన వరదలకు వంతెన తెగిపోయింది. దీంతో కొండాయి గ్రామం నీటమునిగింది. ఈ సమయంలో పలువురు గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగి ఏడాది అవుతున్నప్పటికీ వంతెన పునఃనిర్మాణానికి మంత్రి సీతక్క చొరవ తీసుకోలేదు. వంతెన ఇంకా పూర్తికాకపోవడంతో.. మళ్లీ భారీ వర్షాలు పడుతుండటంతో కొండాయి గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు పక్కనే ఉన్న దొడ్ల గ్రామానికి వలసవెళ్లారు. కానీ వారు రానివ్వకపోవడంతో అడవిలోకి వెళ్లిపోయారు. దాదాపు 30కి పైగా కుటుంబాలు అడవిలోనే కర్రలతో గుడిసెలు వేసుకుని తలదాచుకున్నారు. అయితే అక్కడ కూడా అటవీ శాఖ అధికారులు ఉండనివ్వకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
Kondayi2
ఈ క్రమంలో మంత్రి సీతక్కపై కొండాయి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆస్తి, ప్రాణ నష్టం జరిగినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా తమ గోస తీర్చడం లేదని.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఫొటోలు దిగి వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి సీతక్క నిర్లక్ష్యం.. ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు
వరదలకు ఊరు మునుగుతున్నా పట్టించుకోని మంత్రి సీతక్క.. దిక్కుతోచని స్థితిలో గ్రామ ప్రజలు
రానివ్వని పక్క ఊరి గ్రామస్తులు.. అడవిలో ఉండేందుకు అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో… pic.twitter.com/WhxN6rHR7B
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2025