యాదగిరిగుట్ట, డిసెంబర్ 28: యాదగిరిగుట్టలో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలను ఈ నెల 30న వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు ప్రధానాలయంలో శ్రీస్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. పాతగుట్ట లక్ష్మీనారసింహస్వామి ఉత్తర రాజగోపురం గుండా 6.45 నుంచి 7.30 గంటలకు వైకుంఠనాథుడిగా దర్శనం ఇవ్వనున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి బ్రేక్ దర్శనం ఉదయం ఉదయం 10.30 నుంచి 11.30 గంటలకు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. 30న ప్రారంభమయ్యే స్వామివారి ఆధ్యయనోత్సవాలు జనవరి 4వ తేదీవరకు కొనసాగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భక్తులచే నిర్వహించే సుదర్శన నారసింహహోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవాలను రద్దు చేసినట్టు ఈవో వెల్లడించారు.