హిమాయత్‌నగర్, నవంబర్ 4: అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్‌లంతా బీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ వెల్లడించారు. ఈ మేరకు మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని తెలిపారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముదిరాజ్‌ల ఆత్మబంధువని, ముదిరాజ్‌ల సంక్షేమం, అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న ఆయన హ్యాట్రిక్ సీఎం కావాలని కోరుతూ తీర్మానించామని చెప్పారు. ముదిరాజ్ సా మాజిక వర్గానికి ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిచ్చి వివిధ పథకాలను అమలు చేసి వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేసిందని కొనియాడారు.
శాసన మండ లి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ నాయకత్వంలో మత్స్య పారిశ్రామిక సహకార సం ఘాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నామని వివరించారు. ఎన్నికల తర్వాత అన్ని పదవుల్లో ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్‌ల కలలు సాకారం కావాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచేందుకు ముదిరాజ్‌లు సంపూర్ణ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.