Jharasangam | భక్తులతో కిటకిటలాడిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయం
Jharasangam | దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఝరాసంగం కేతకీ సంగమేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది.
ఝరాసంగం : దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఝరాసంగం ( Jharasangam ) కేతకీ సంగమేశ్వర క్షేత్రం (Ketaki Sangameshwara Temple ) భక్తులతో కిటకిటలాడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అష్టతీర్థాల నిలయమైన అమృత గుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ఆ త్రిలోకనాథుని దర్శనం చేసుకున్నారు. కేతకీ వనమంతా ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరి మంత్రంతో భక్తపారవశ్యంతో స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు బారులు తీరి, ఆ పరమశివుని కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు.

తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలివచ్చారు. జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్ ప్రాంతాల నుంచి శివభక్తులు పాదయాత్రగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో దేవుజా, డీఎస్పీ సైదా నాయక్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షిస్తుండగా, దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివరుప్ప, సర్పంచ్ వినోద బాలరాజ్ తదితరులు భక్తులకు అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

