Revanth Reddy | భైంసా, అక్టోబర్, 28: రేవంత్ బాగోతం బయటపెడతానని కాంగ్రెస్ నాయకుడు విజయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ముథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తే.. తనను కాదని నారాయణరావు పటేల్‌కు కేటాయించారని మండిపడ్డారు. శనివారం భైంసాలో ఆయన మాట్లాడారు. రేవంత్ టికెట్ ఇస్తానని అమెరికా నుంచి రప్పించి నా సమయమంతా వృథా చేశారని, అమెరికా వస్తే ఎన్నారైలంతా చెప్పుతో కొడతారని హెచ్చరించారు. ‘నీకు డబ్బు దాహం ఎక్కువగా ఉన్నది. అతి త్వరలో నీ బాగోతం బయటపెడతా.
డబ్బులకు టికెట్ అమ్ముకున్నావ్. ఎన్నారై అని అనుకుంటున్నావ్. నేను గ్రామస్థాయి నుంచి వచ్చిన వాడినే’ అని ధ్వజమెత్తారు. రేవంత్ ఇంట్లో ఈడీ సోదాలు చేయాలని, టికెట్ కోసం నారాయణరావు పటేల్ ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చాడో బయటపెడతానని వెల్లడించారు. ముథోల్ నియోజకవర్గ ప్రజలంతా రేవంత్‌కు శాపనార్థాలు పెడుతున్నారని, అమెరికాలో సైతం ఆయన దందాలు బయటపెడతానని స్పష్టంచేశారు.