హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. ఈ సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది.
పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులు, వాటి ధరల హెచ్చుతగ్గులు, వినియోగదారుల అవసరాలు, వారికి అందుతున్న సేవలు తదితర విషయాలపై సమావేశంలో చర్చించారు. స్థాయీ సంఘం సభ్యుడైన వద్దిరాజు పలు సూచనలు చేశారు.