హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): బడేభాయ్.. చోటేభాయ్ తెలంగాణను గరీబ్‌ను చేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్ సహకార, సమాఖ్య స్ఫూర్తిని కాకుండా సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వానికి సహకరించే బడ్జెట్‌గా ఉన్నదని అభివర్ణించారు.
విభజన చట్టం అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించే కాదని, అందులో తెలంగాణ కూడా ఉన్నదనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక్కదానికైనా జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరినా పెడచెవిన పెట్టిందన్నారు.