MP Ranjith Reddy | చేవెళ్ల ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు: ఎంపీ రంజిత్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. చేవెళ్ల ప్రజలకు సేవచేసే అవకాశాలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్లో సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా తొలుత చేవెళ్ల స్థానాన్ని ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ కేటాయించింది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆయన తాను పోటీలో ఉండలేనని పార్టీ అధిష్ఠానానికి చెప్పడంతో.. కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలో నిలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

