MP Ranjith Reddy | సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru-Ranga Reddy lift scheme)పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి (MP Ranjith Reddy) అన్నారు. ఎత్తిపోతల పథకం పనులు ఎలా జరుగుతున్న తీరును శనివారం నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రాజెక్టు పనుల్లో మొదటి భాగమైన శ్రీశైలం బ్యాక్‌వాటర్ ప్రాంతమైన నాగర్ కర్నూల్లోని అంజనగిరి రిజర్వాయర్ మొదలుకొని ఉద్దండపూర్ రిజర్వాయర్ వరకు జరుగుతున్న కెనాల్, టన్నెల్, సర్జ్‌పూల్, పంపుహౌస్ పనులను అక్కడి పనిచేస్తున్న ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేక వాహనాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టు సందర్శనకు తీసుకుకెళ్లే ఏర్పాట్లను చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు.