హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): బీజేపీ నుంచి స్వయంగా మోదీ పోటీ చేసినా చేవెళ్లలో గెలిచేది బీఆర్ఎస్సేనని, తానే బరిలో ఉంటానని ఎంపీ రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటించడమే బీఆర్ఎస్ విధానమని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రాజకీయాలు పక్కనపెట్టి జోతిష్యాలు చెప్పుకోవటం అలవాటు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ స్వయంగా పోటీ చేసినా గెలిచేది బీఆర్ఎస్సేనని తతేల్చల్చి చెప్పారు.. ఎన్ని చేసినా తాము ఓడిపోవడం ఖాయమని రేవంత్‌కు తెలిసివచ్చిందని, అందుకే మతిభ్రమించిందని, తానేం మాట్లాడుతున్నారో తెలియడం లేదని విమర్శించారు. మాయమాటలకు చేవెళ్ల ఓటర్ల మోసపోతారని రేవంత్ అనుకోవడం భ్రమేనని పేర్కొన్నారు.