అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున సినిమా పుష్ప. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అటు రంగస్థలం.. ఇటు అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్స్ విడివిడిగా కొట్టి జోరు మీదున్న సుకుమార్, బన్నీ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ రికార్డులు తిరగరాస్తుంది. అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్ దాటేసింది కూడా. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మధ్యలో కరోనా వచ్చి కొంత ఆలస్యం అవుతుంది కానీ లేదంటే ఈ పాటికి షూటింగ్ పూర్తయ్యేది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి.
దాంతో ఎక్కడా రిస్క్ తీసుకోకుండా పుష్ప సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అవుతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఏకంగా నాలుగు నెలల పాటు ఈ సినిమాను వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ అనౌన్స్ చేసిన సెప్టెంబర్ 13న పుష్పను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. పుష్పను ఒకటి కాదు రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలోనే మొదటి భాగం సెప్టెంబర్ 13న రిలీజ్ చేసి.. రెండో భాగాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో హడావిడిగా చేసి.. అనవసరంగా క్వాలిటీ లేని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే కంటే కూడా కావాల్సినంత టైమ్ తీసుకుని అద్భుతమైన ప్రాజెక్ట్ విడుదల చేయాలని వాళ్లు అనుకుంటున్నారు. అందుకే పుష్ప సినిమాను వాయిదా వేస్తున్నారు. మరోవైపు రెండు భాగాలకు సరిపోయేంత కంటెంట్ కూడా ఉండటంతో ఈ సినిమాను 2 పార్ట్స్ గా తీసుకురావాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. తెలుగులో ఇప్పటికే బాహుబలి, ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వచ్చాయి. కేజీఎఫ్ కూడా రెండు భాగాలుగా వస్తుంది. ఇప్పుడు పుష్పను కూడా అలాగే చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నెటిజన్ కామెంట్..హేమ రిప్లై ఇదే..!
సురక్షితంగా ఉండండి.. సంక్షోభం నుండి బయటపడుతాం : మహేశ్‌బాబు
కరోనా ఎఫెక్ట్.. తండ్రికి క్షవరం చేసినబండ్ల గణేష్
కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్
ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా ..!
అంత చేసినా చివరికి యువతిని కాపాడలేకపోయానంటూ సోనూసూద్ భావోద్వేగం
కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?