Kubera | టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు బాగానే ఉంటాయని తెలిసిందే. ఈ సారి ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) సినిమా చేస్తుండటంతో సూపర్ క్యూరియాసిటీ నెలకొంది. DNS (వర్కింగ్ టైటిల్)తో D51గా వస్తోన్న ఈ మూవీకి ఇటీవలే కుబేర (Kubera) టైటిల్‌ను ఫైనల్ చేశారని తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ లాంఛ్ చేసిన కుబేర ఫస్ట్ లుక్ ఇప్పటికే అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
ధనుష్ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తుండగాజ. బ్యాక్ డ్రాప్లో శివపార్వతుల ఫొటో ఉన్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా కుబేరలో రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. అక్కినేని నాగార్జున (Nagarjuna)కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసిందే. తాజాగా నాగ్ పోషిస్తున్న పాత్ర ఇదేనంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడట. నాగార్జున ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కుబేర సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధనుష్ దీంతోపాటు స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కుబేర ఫస్ట్ లుక్ వైరల్..
#Dhanush in #Kubera – a #shekharkammula film @dhanushkraja pic.twitter.com/Ogmlx1INEm
— Latha Srinivasan (@latasrinivasan) April 16, 2024
DNS షూటింగ్ లొకేషన్ ఫొటోలు..
A blockbuster voyage that’s bound to resonate with the nation! 😎#DNS kicks off with a pooja ceremony and the shoot begins with a key schedule 🎥
More details on the way ⏳@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel @puskurrammohan @SVCLLP pic.twitter.com/bYBtyuwfGA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 18, 2024
3Minitues To Go #D51 #DNS 🔥🔥@dhanushkraja pic.twitter.com/GF1eAXmY4D
— ANANDH DHANUSH VERIYAN (@DhanushianV) January 18, 2024
Buzz about #D50:
• #SJSuryah & #SundeepKishan signed on to portray the role of brothers alongside #Dhanush 🤯🤩
• #VishnuVishal, #DusharaVijayan & #Kalidas undertaking pivotal roles 👏🏻
• The film is set against the backdrop of North Madras 🔥
• Direction: #Dhanush |… pic.twitter.com/FTlh7Ybcv4
— KARTHIK DP (@dp_karthik) May 24, 2023