హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం ఆయన రాసిన బహిరంగలేఖను విడుదల చేశారు.
చీఫ్ సమాచార కమిషనర్‌తోపాటు కమిషన్‌లో ఐదుగురిని నియమించినా ఒక్కరు కూడా బీసీలు లేరని మండిపడ్డారు. మిగతా 3 పోస్టులనైనా బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేఖలో కోరారు.