గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 13:06:23

దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కవిత

దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కవిత

మహబూబాబాద్‌ : ఆదివారం కిడ్నాప్‌నకు గురై నాలుగు రోజుల తర్వాత విగత జీవిగా మారిన బాలుడు  దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు కుసుమ రంజిత్ రెడ్డి, వసంతను మహబూబాద్‌ ఎంపీ మాలోతు కవిత పరామర్శించారు. జిల్లాలోని శనిగపురంలో వారి స్వగృహంలో కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. బాలుడు లేని లోటు ఎవరు పూడ్చలేరని కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి దుర్ఘటనలు మరలా పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని పోలీసు శాఖ వారిని కోరారు.