బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 20:58:34

రైల్వే జీఎంను కలిసిన ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌

రైల్వే జీఎంను కలిసిన ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌

పెద్దపల్లి : తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రైల్వే సమస్యలను పరిష్కరించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలోని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కార్యాలయానికి వెళ్లి జీఎం గజానన్‌ మాల్యాకు వినతి పత్రం అందజేశారు. 

పెద్దపల్లి, మంథని, రామగుండం, రేచినలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు, మంచిర్యాలలో అండర్‌ బ్రిడ్జి పనులను సత్వరమే ప్రారంభించాలని కోరారు. పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలో ఫ్లాట్‌ఫాంల ఆధునీకరణ, పెద్దపల్లిలో థర్డ్‌ రైల్వేలైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే బోర్డు ద్వారా పనులు చేపట్టాలని కోరారు. 

ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం 

మిషన్ భగీరథ పెండింగ్ పనులను పూర్తి చేయండి 

కూతురు పరీక్ష కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు 

క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి logo