కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | టీఆర్ఎస్కే పూర్తి మద్దతు తెలుపుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని కమలాపూర్ మండల ఆర్ఎంపీ డాక్టర్లు స్పష్టం చేశారు.

వరంగల్ రూరల్ : టీఆర్ఎస్కే పూర్తి మద్దతు తెలుపుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని కమలాపూర్ మండల ఆర్ఎంపీ డాక్టర్లు స్పష్టం చేశారు. కమలాపూర్ మండల ఇంచార్జి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా పరకాలలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ ఆర్ఎంపీ డాక్టర్లకు గ్రామాలలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
గ్రామాలలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేది ఆర్ఎంపీ వైద్యులేనని తెలిపారు. మండలంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గమనించాన్నారు. గత ప్రభుత్వాల పనితీరు, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును గమనించాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం మంజూరు చేసిన ప్రతిపైసా కేసీఆర్ ఇచ్చినవేని తెలిపారు.
ఆర్ఎంపీ డాక్టర్లకు అండగా నేనుంటా. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వం అందించే డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మిస్తాం. ఆర్ఎంపీ డాక్టర్ల సత్తా ఏంటో మండలంలో మీరు చూపెట్టాలన్నారు.

మీ సమస్యల పరిష్కారానికి 100 శాతం కృషి చేస్తా. ఈ రోజు బీజేపీలో చేరుతున్న ఈటల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పనిచేస్తామని ముందుకు వచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు.
వ్యక్తులు పార్టీ మారినంత మాత్రాన టీఆర్ఎస్ అయ్యే నష్టం ఎంలేదన్నారు. కార్యక్రమంలో రూరల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు నేతాని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

