హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నదని, వాటిని అమలు చేయడం చేతగాకే స్థానిక సంస్థల ఎన్నికలను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల సాకు చూపిందని ఆరోపించారు.
6 గ్యారెంటీల అమలుకు ఎన్ని నిధులు అవసరం? విధి విధానాలేమిటి? అనే దానిపై కసరత్తు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తామనడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవzంతో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.