Motkupalli Narasimhulu | హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురయ్యాడు. బీపీ, షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బేగంపేటలోని వెల్నెస్ హాస్పిటల్లో మోత్కుపల్లికి చికిత్స అందిస్తున్నారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం చేశారంటూ నిన్న దీక్ష చేయడంతో బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.