ఈటల భూకబ్జాలపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
ఈటల భూకబ్జా | మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలపై బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలది ఆత్మగౌరవం కాదు..

హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలపై బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మద్రోహం అని మోత్కుపల్లి మండిపడ్డారు. దళితుల భూములు కబ్జా చేసిన ఈటల ఆత్మగౌరవం కోసం తన పోరాటం అని వ్యాఖ్యానించడం సిగ్గు పడాల్సిన విషయమని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. వందల ఎకరాలు కబ్జా చేసి, వేల కోట్ల రూపాయాలు సంపాదించుకునేందుకు ఈటల రాజేందర్‌కు అవకాశమిచ్చినందుకు.. సీఎం కేసీఆర్ బొమ్మకు జీవితకాలం మొక్కిన తప్పు లేదన్నారు మోత్కుపల్లి.
ఈటల వెనుకాల ఇంత బాగోతం ఉందని ఎవరికీ తెలియదు అన్నారు. పేదోడిని, బీసీని అని చెప్పుకునే ఈటల రాజేందర్ దళితుల భూములను కబ్జా పెట్టడం దారుణం. దేవాలయ భూములు కబ్జా చేయడం సరికాదు. అసైన్డ్ భూములనే కబ్జా చేయాలన్న ఆలోచన ఈటలకు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు సంపాదించుకోవడానికా? ప్రజల కోసమా? అని ప్రశ్నించారు.
దళితుల భూములను గుంజుకోవడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. నోరు తెరిస్తే ఈటల ఆత్మగౌరవం అంటున్నారు. ఇవాళ దళితుల భూముల కోసం ఈటల రాజేందర్ పోరాడి ఉంటే ఆయన పక్షాన ప్రజలు నిలబడేవారు. నీ విధానం ఆత్మద్రోహం అయినప్పుడు ప్రజలు నీ పక్షాన ఎలా నిలుస్తారని మోత్కుపల్లి ప్రశ్నించారు. కబ్జా చేసిన భూములను దళితులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇన్ని ఆస్తులు సంపాదించిన బీసీ నాయకుడు రాష్ర్టంలో ఎవరూ లేరని మోత్కుపల్లి స్పష్టం చేశారు. నాయకుడు అనే వాడు ప్రజల కోసం బతకాలి.. ప్రజల కోసం చావాలి అని అన్నారు. ఈటల ఉద్యమకారుడు కాదు.. అంతకన్నా ప్రజల మనిషి కాదు. బీసీ నాయకుడు ఈటలకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అందుకు కేసీఆర్‌కు ఈటల రాజేందర్ జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8 మంది మృతి
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా వేళ.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

