హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ)/కార్పొరేషన్: కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ (85) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని గంగుల నివాసంలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. నర్సమ్మ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్ర గాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, జ గదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథో డ్, జోగు రామన్న, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె భౌతికకాయానికి మాజీ మం త్రి కొప్పుల ఈశ్వర్, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు నివాళులర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.