నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను కుంచాల నాగలక్ష్మి (27), భువన్ సాయి (7), అవంతిక (9)గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా జనకారం గ్రామానికి చెందిన వారని తెలిపారు. భార్యా భర్తల గొడవే ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.