హైదరాబాద్: మూడు రోజుల క్రితం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని గురుకుల పాఠశాలలో (Gurukula Student) పదో తరగతి చదువుతున్న వర్షిత (15) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. వర్షిత ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారకమన్నారు. ఆమె కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి సాధించాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలల స్థాయి దిగజారిందని విమర్శించారు. రెండేండ్లలో 100 మందికిపైగా గురుకుల విద్యార్థులు మరణించారన్నారు. విద్యార్థుల మరణాలపై కాంగ్రెస్ సర్కార్ కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి బాధ్యతలేదంటూ మండిపడ్డారు. సానుభూతి, జవాబుదారీతనం అసలే లేవని దుయ్యబట్టారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన మమత, తిరుపతి దంపతుల కూతురు శ్రీవర్షిత (15) వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. దీపావళి సెలవులకు వెళ్లిన శ్రీ వర్షిత ఈ నెల 23న తిరిగి పాఠశాలకు వచ్చింది. గత శుక్రవారం ఉదయం (ఈ నెల 24) పాఠశాల సిబ్బంది సెల్‌ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వేధిస్తున్నారని, తనను వెంటనే తీసుకెళ్లాలని, ఇక్కడ ఉండలేనని మొరపెట్టుకున్నది. దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నట్టు బదులిచ్చారు. ప్రార్థనా సమయం కావడంతో విద్యార్థులంతా బయటకు రాగా, శ్రీవర్షిత కనిపించలేదు. దీంతో డార్మెటరీ హాల్‌కు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకొని విగత జీవిలా కనిపించింది. కాగా, వర్షిత మృతదేహాన్ని కూడా అంబులెన్సులో కాకుండా ట్రాక్టర్లో తరలించడం తోటి విద్యార్థినులతోపాటు అందరినీ కలచివేసింది. విద్యార్థినులు రోదిస్తున్న వీడియోను కేటీఆర్ పోస్టు చేశారు.
This is heartbreaking indeed. Heartfelt condolences to the family of Varshita 🙏
Truly shameful that the same Gurukul schools that did exceedingly well until 2 years go have now come to this
More than 100 kids have died in the last 2 years
Zero empathy from Congress Govt and… https://t.co/iw7cGU7FSb
— KTR (@KTRBRS) October 27, 2025