మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 17:57:02

ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు అవసరం

ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు అవసరం

భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థ రక్షణ విషయంలో తీసుకొంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రమాదాల నివారణకు మరింత గట్టి చర్యలు తీసుకొంటూ ప్రమాదరహిత పరిశ్రమగా సింగరేణిని తీర్చిదిద్దాలి. ఉత్పత్తితో పాటు రక్షణకు కూడా అధిక ప్రాధాన్యతనివ్వాలని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ మలయ్‌ టికేదార్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ (డి.జి.ఎం.ఎస్‌.) సౌత్‌ జోన్‌ కార్యాయం నుంచి సింగరేణి యాజమాన్యంతో జరిగిన 28వ రక్షణ ద్వైపాక్షిక సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సింగరేణి సంస్థ రక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తగినన్ని నిధులను కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య పెరగడం ఆందోళనకరమని, వీటిని శూన్య స్థాయికి తేవడానికి కృషి చేయాలని మలయ్‌ టికేదార్‌ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ కరోనా నివారణకు తీసుకున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

డి.జి.ఎం.ఎస్‌. కార్యాలయం నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్సులో డైరెక్టర్స్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ అధికారులు, కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ నుంచి సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌ (డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ & పా), ఎన్‌.బలరామ్‌ (డైరెక్టర్‌ ఫైనాన్స్‌), జి.వెంకటేశ్వర్‌ రెడ్డి జీ.ఎం. (సేఫ్టీ), రామగుండం-1 నుంచి డి.సత్యనారాయణరావ్‌ (డైరెక్టర్‌ ఇ&ఎం), కార్పొరేట్‌ లోని వివిధ విభాగాల జనరల్‌ మేనేజర్లు అధికారులు అన్ని ఏరియాల నుంచి ఏరియా జీ.ఎం.లు, అన్ని రీజియన్ల సేఫ్టీ జనరల్‌ మేనేజర్లు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. 

కార్పొరేట్‌ కార్యాలయం నుంచి నరల్‌ మేనేజర్లు కె.వి.రమణమూర్తి, వై.జి.కె.మూర్తి, కె.గురవయ్య, నాగభూషన్‌ రెడ్డి, ఎన్‌.నాగేశ్వర్‌ రావు, దేవీ కుమార్‌, సంజీవరావ్‌, స్వామినాయుడు, బి.శ్రీనివాసరావు,టి.సురేష్‌, డి.రాంచందర్‌, జి.రాంకుమార్‌, సీ.హెచ్‌.రమేష్‌ బాబు, డాక్టర్‌ మంథా శ్రీనివాస్‌,  జ్ఞాన సుందరం తదితరులు పాల్గొన్నారు.


logo