Operation Musi | హైదారాబాద్ సిటీబ్యూరో/చిక్కడపల్లి, అక్టోబర్16 ( నమస్తే తెలంగాణ ): మూసీ సుందరీకరణ పేరిట మీ కమీషన్ల కోసం మమ్మల్ని బలిపెడ్తరా అంటూ పలువురు మహిళలు సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. సుమారు 50 మంది మహిళలు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బుధవారం ర్యాలీ తీశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ సుందరీకరణ అంటూ ప్రశ్నించారు. మా ఇండ్లు కూల్చితే, కుటుంబంతో సహా మీ ఇంటికొచ్చి ఉంటామని పలువురు హెచ్చరించారు. కూల్చివేతలు ఆపకపోతే.. పెద్ద ఉద్యమాన్ని చేపడుతామని స్పష్టంచేశారు. తమ ఇండ్లపై అధికారులు వేసిన ఆర్బీ-ఎక్స్ మార్క్‌ను తొలిగించాలని డిమాండ్ చేశారు. ఆంతుకు ముందు బీడీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళలు పాల్గొని వారి కష్టాలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ర్యాలీలో బ్యానర్లు ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘కూల్చివేతలు ఆపాలి’
డీబీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డీబీఎఫ్ జాతీ య కార్యదర్శి పీ శంకర్ మాట్లాడుతూ మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్ల కూల్చివేతను ఆపాలని డిమాండ్ చేశారు. గతంలోనే వీటికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని, కరెంట్, నల్లా కనెక్షన్లు ఇచ్చిన తర్వాత కూలగొట్టడం సరికాదంటూ అభిప్రాయపడ్డారు. సామాజిక కార్యకర్త ఆర్ వెంకట్‌రెడ్డి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్‌రాజ్ మా ట్లాడారు. తెలంగాణ క్రాంతిదళ్ నాయకులు పృథ్వీరాజ్, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, రఘునందన్, జాన్, హర్ష చైతన్యపురి, జేఏసీ కన్వీనర్ నర్సింహ, ప్రసాద్, పులి కల్పన తదితరులు పాల్గొన్నారు.
మా బతుకులు మారితే అభివృద్ధే కదా!
చెత్త ఏరుకుంటే గానీ పూటగడవని బతుకులు మావి. మూసీ సుందరీకరణ చేస్తే మొ దటగా మా బతుకులే కదా మారాల్సింది. మమ్మల్ని ఇక్కడి నుంచి తరలిస్తమంటున్నరు. వారికి నచ్చిన చోటు కు వెళ్లాలంటున్నరు. ఇన్నేండ్లు ఇక్కడి ఇల్లు తో పేగుబంధం ఉంది. మమ్మల్ని ఇలా ఇ బ్బంది పెట్టి సర్కారోళ్లు పండుగ చేసుకుంటున్నరు. ఇది న్యాయం ఎట్లయితది? సీఎ ం సారే ఇట్ల చేస్త ఎవ్వరికి చెప్పుకోవాలె..
-చిట్టమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు