సూర్యాపేట టౌన్, జనవరి 5 : ప్రపంచంలోనే అత్యంత విఫల ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించాడని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలో సుమారు 300 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యువకుల ఆత్మీయ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సరైన ప్రతిపక్షం లేకనే బీజేపీ ఆగడాలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. వాళ్ల రాక్షస పాలనను అంతమొందించే ప్రత్యామ్నాయ పార్టీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నదని అన్నారు.
తెలంగాణ లాంటి అభివృద్ధినే అన్ని రాష్ర్టాలు కోరుకుంటున్నాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన ప్రధాని మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను ఊడబీకి రోడ్డున పడేశాడని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హ యాంలో పేదలు మరింత పేదరికంలోకి వెళ్తుండగా, సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటున్నారని దుయ్యబట్టారు. అందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు..
హైదరాబాద్/వనపర్తి/బయ్యారం, జనవరి 5 : ప్రధాన పార్టీలకు చెందిన నాయకు లు, కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. వనపర్తి జిల్లా పెబ్బేరులోని 5వ వార్డుకు చెందిన బీజేపీ కౌన్సిలర్ గోపిబాబుతోపాటు మరో 200మంది వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన 400 మంది కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పుకొన్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 300 మంది బీఆర్ఎస్లో చేరారు. నారాయణ పురం సర్పంచ్ కుర్సం మాధవి, వార్డుమెంబర్లు జగదీశ్, యశోద, మంగతోపాటు నారాయణపురం, రామచంద్రాపురం, రెండెర్లగడ్డకు చెం దిన 80 గిరిజన కుటుంబాలకు చెందిన 300 మంది న్యూడెమోక్రసీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ గులాబీ కండువాలు కప్పారు.