Weather Update | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : నైరుతి బంగాళాఖాతం లో ఉపరితల చక్రవాత ఆవర్తనం బుధవారం బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే ఆరు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజులు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. గురువారం జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మ హబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్కర్నూల్ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలుల వాన కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.